ఎన్నికల కమిషన్ను తప్పుబట్టే అధికారం ముఖ్యమంత్రి జగన్కు లేదని తెదేపా నేత రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. స్పీకర్ తమ్మినేని సీతారాం రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వచ్చిన తర్వాత.. జరిగే నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అని నిలదీశారు. స్థానిక ఎన్నికల్లో అధికారుల అండతో అరాచకాలు చేశారని మండిపడ్డారు.
కడప జిల్లాలో రిజర్వేషన్లపై తెదేపా ఫిర్యాదు
కడప జిల్లాలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల కేటాయింపులో చాలా అవకతవకలు జరిగాయని కమలాపురం తెదేపా ఇంఛార్జీ పుత్తా నరసింహారెడ్డి ఆక్షేపించారు. ఎస్సీ, బీసీలు ఎక్కువగా ఉన్నచోట ఓసీలకు...., ఎస్సీలు, బీసీలు తక్కువగా ఉన్న చోట బీసీలకు కేటాయిస్తూ రిజర్వేషన్లు ఇచ్చారని ఆయన జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా పడటంతో రిజర్వేషన్లు మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులపై ఫిర్యాదు చేసిన తమకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. వీటన్నింటిపై జిల్లా ఎన్నికల అధికారులతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని అన్నారు.
నెల్లూరులో బెదిరింపులపై ఫిర్యాదు
నెల్లూరు జిల్లాలో స్థానిక ఎన్నికల్లో వైకాపా అరాచకాలకు పాల్పడిందని తెదేపా నేతలు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్కు ఫిర్యాదు చేశారు. తెదేపా అభ్యర్ధులు నామినేషన్ వేయకుండా వైకాపా నేతలు అడ్డుకున్నారని.., బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర కోరారు.
ఇదీ చూడండి: