తెదేపా నేత అచ్చెన్నాయుడి అరెస్టును ఆ పార్టీ నేత కూన రవికుమార్ తీవ్రంగా ఖండించారు. ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. బీసీ వర్గాలను అణగదొక్కాలని అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని ఆరోపించారు. అచ్చెన్నాయుడిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు పెట్టిన కేసులు అప్రజాస్వామికం అన్నారు. తెదేపా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నాయకులను టార్గెట్ చేస్తున్నారని కూన రవికుమార్ మండిపడ్డారు.
ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జీఎంఆర్‌తో ప్రభుత్వం ఒప్పందం