శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్‌ను ఈరోజు కూడా బంగారు వర్ణంలో ఉన్న లేలేత కిరణాలు తాకాయి. సూర్యకిరణాలు ఆదిత్యుని చేరి.. స్వామివారి పాదాలను నుంచి.. శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం 9 నిమిషాల పాటు ఆవిష్కృతమైంది. ఉత్తరాయనం, దక్షిణాయనం మార్పుల్లో ఈ కిరణ స్పర్శ భాస్కరుని తాకుతుంది. ఏటా మార్చి 9,10 తేదిల్లో... మరలా అక్టోబర్ 1, 2 తేదీల్లో ఈ దృశ్యం భక్తులకు కనువిందు చేస్తోంది. ఈ సారి ఉత్తరాయంలో రెండు రోజులపాటు కిరణాలు స్వామివారి పాదాలను తాకడం భక్తుల అనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి...