రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఏఎంసీ చైర్మన్ చాట్ల సుజాత పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయ కేంద్రాల వద్ద రైతులకు విత్తనాల పంపిణీ చేశారు. రైతులకు కావలసిన విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని సుజాత అన్నారు. రైతులకు రాయితీపై అందిస్తున్న విత్తనాలు ప్రతి ఒక రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండి :