ETV Bharat / state

దశల వారీగా దేవాలయాల అభివృద్ధి : మంత్రి వెల్లంపల్లి

రానున్న ఐదేళ్లలో రాష్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దశల వారీగా దేవాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

దేవాదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
author img

By

Published : Jul 9, 2019, 5:30 PM IST

రాష్ట్రంలోని దేవాలయాలను దశల వారీగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్​తో కలిసి దర్శించుకున్నారు. రానున్న ఐదేళ్లల్లో రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. దేవాలయాలకు మహర్దశ తీసుకొస్తామని తెలిపారు. దర్శనం అనంతరం కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు.

దేవాదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

ఇదీ చదవండి... సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేశారు: లేకేశ్

రాష్ట్రంలోని దేవాలయాలను దశల వారీగా అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్​తో కలిసి దర్శించుకున్నారు. రానున్న ఐదేళ్లల్లో రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. దేవాలయాలకు మహర్దశ తీసుకొస్తామని తెలిపారు. దర్శనం అనంతరం కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు.

దేవాదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

ఇదీ చదవండి... సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆపేశారు: లేకేశ్

Intro:తిరుపతి నగర చరిత్ర లోనే భారీ ప్రాజెక్టుగా అభివర్ణించిన గరుడ వారికి ప్రాజెక్టు పనులు ఉన్నపళంగా ఆగయ్య అన్న వార్త కార్పొరేషన్ వర్గాలలో చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి 25 శాతానికి మించిన ప్రాజెక్టులను ఆపేయమన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వారధి నిర్మాణానికి సైతం బ్రేక్ పడింది. ఇటీవల ఊపందుకున్న పనులు అంతలోనే ఆగిపోవడం ఏమిటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నగర ప్రజలు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా గత వారం నుంచి పూర్తిగా స్తంభించాయి.


Body:కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత స్మార్ట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు గరుడ వారధి. దీనికి కార్పొరేషన్ తో పాటు తితిదే ఆర్థిక సహకారం కూడా తోడైంది. దీంతో ప్రత్యేక ప్రాజెక్టుగా పరిగణించాల్సి ఉండగా.. సాధారణ ప్రాజెక్టుగానే గుర్తించడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో.. క్షేత్రస్థాయి 25 శాతం పనులు పూర్తియి.. 25 బిల్లు కూడా చెల్లింపు జరిగిన పనులే కొనసాగాలని.. మిగతా వాటిని తాత్కాలికంగా నిలిపివేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇదే నిబంధన ప్రకారం తాజాగా తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు కాంట్రాక్టు సంస్థకు తాఖీదులు జారీ చేశారు. గరుడ వారధి‌, స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ విలువ రూ.684 కోట్లు కాగా.. అందులో 25 శాతం పూర్తి చేసి.. 25 శాతం బిల్లులు చెల్లించి ఉంటే.. వారధి పనులు ఆగేవి కాదని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 25 శాతం పనులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గత మూడు నెలలుగా ఎన్నికలు, ప్రభుత్వం మార్పు తరుణంలో గుత్తేదారు సంస్థ రెండో దశలో సమర్పించిన బిల్లులో చాలా వరకు చెల్లింపు జరగలేదు అని సమాచారం. పనులు జరిగిన బిల్లులు క్లైమ్ కానీ కారణంగా ప్రభుత్వ నిర్ణయానుసారం పనులు ఆపాల్సి వచ్చింది. తితిదే, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ పై ఉన్న నమ్మకం, ముఖ్యంగా గుత్తేదారు సంస్థ అధినేత స్వామివారి పరమ భక్తుడు కావడంతో పనులను వేగంగా చేయాలని తలచి ఇప్పటికే సుమారు రూ.130 కోట్ల నుంచి రూ.140 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు పనులు వేగవంతం చేయాలని ఒత్తిడి చేసినా అధికారులు.. ఉన్నట్టుండి పనులను నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వడంతో నిర్మాణ సంస్థ ఆప్కాన్ ప్రతినిధులు హతాశులయ్యారు. దీంతో పని ప్రదేశం నుంచి కోట్లు విలువైన యంత్రాలలో సగం వరకు అవిలాల సమీపంలోని కాస్టింగ్ యార్డుకు తరలించేశారు.


Conclusion:తిరుపతి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం అయిన గరుడ వారధి పనులు నిలిపివేయడంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు సంవత్సరాల లోపు వారికి పూర్తిగా అందుబాటులోకి వస్తున్న ఆశ నిరాశగా మిగిలింది. ఇదిలా ఉండగా ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన ఉన్నందున ఆయనతో చర్చించి పనులు పునఃప్రారంభించినున్నట్లు అధికారులు అంటున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.