ETV Bharat / state

ఇప్పటికి వదిలేస్తున్నాం... మరోసారి కనిపిస్తే జరిమానా తప్పదు! - police awareness program on mask

రెండో వేవ్​గా కరోనా పంజా విసురుతోంది. వైరస్ బారి నుంచి తప్పించుకోవాలంటే.. మాస్క్ తప్పనిసరి. కానీ నిర్లక్ష్యమో... కరోనా రాదనే అలసత్వమో... ప్రజలు మాస్క్​ను ధరించటం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు.. మాస్క్​ ధరించటంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించారు. వాహనదారులకు, పాదచారులకు.. మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

police awareness program on mask
మాస్క్​ ధరించటంపై పోలీసుల అవగాహన కార్యక్రమం
author img

By

Published : Mar 28, 2021, 12:29 PM IST

శ్రీకాకుళం జిల్లాలో...

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పోలీసులు కరోనా నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. కొవిడ్ సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమనీ.. చదువుకున్నవారు సైతం నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా.. మాస్క్ ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విశాఖ జిల్లాలో...

కరోనా పోయిందనే భావనలో చాలా మంది ఉన్నారనీ... ఈ విధమైన ధోరణి సరైనదని కాదని విశాఖ జిల్లా అనకాపల్లిలోని గవరపాలెంలో పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ... మాస్కులు ధరించాలని సూచిస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో...

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనా వైరస్ వ్యాప్తి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ.. పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాస్కు లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు.. మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలు సహకరించాలని కోరారు.

కృష్ణా జిల్లాలో...

మాస్క్ పెట్టు.. లేదంటే చలానా కట్టు అంటూ కృష్ణా జిల్లా గన్నవరం సర్కిల్ పరిధిలో.. మాస్క్ ధరించటంపై పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. మాస్క్ ధరించకుండా ప్రయాణిస్తున్న వారి వద్ద నుంచి రూ. 70 చొప్పున చలానా వసూలు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లాలో...

మాస్క్ లేకుండా తిరిగితే.. కరోనా వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుందో.. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు చర్చి సెంటర్ వద్ద రహదారిపై.. మాస్క్ లేకుండా ఉన్నవారికి మాస్కులు అందజేశారు. ఇకపై మాస్క్ లేకుండా కనిపిస్తే.. జరిమానా తప్పదని హెచ్చరించారు.

నెల్లూరు జిల్లాలో...

కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ సూచించారు. కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్న కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద మాస్కు ధరించాలని అవగాహన కల్పించారు. మాస్కు లేకుండా రహదారిపైకి వచ్చిన అందరికీ.. మాస్కులు అందజేశారు. ఇకపై మాస్కు లేకుండా ఇళ్ల నుంచి బయటకు వస్తే.. కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.

కడప జిల్లాలో...

ప్రజలు మాస్కులు ధరించాలంటూ.. కడప జిల్లా పోలీస్ అధికారులు వినూత్నంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహదారులకు గులాబీ పువ్వు, మాస్కు అందించి.. అవగాహన కల్పించారు. ద్విచక్రవాహనాలు, ఆటో, బస్సులలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు.. ఎస్పీ అన్బురాజన్ స్వయంగా మాస్కులు అందజేశారు. మాస్కులు లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కర్నూలు జిల్లాలో...

కరోనా వైరస్ వ్యాప్తి పట్ల.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప సూచించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఎస్పీ స్పష్టం చేశారు. మాస్కు లేకుండా రహదారులపైకి వచ్చిన వారికి... రూ.100 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

అనంతపురం జిల్లాలో...

కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు కోరారు. నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఎస్పీ వాహనదారులకు అవగాహన కల్పించారు. మాస్కులు ధరించని వాహనదారులకు జరిమానా విధించారు. మాస్కు ధరించి వెళ్తున్న వాహనదారులకు పోలీసు సిబ్బందితో గులాబీ పువ్వులు ఇప్పించి అభినందించారు.

ఇదీ చదవండి:

తనిఖీలకు వెళ్లిన ఉన్నతాధికారి.. కనిపించని సిబ్బంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.