ETV Bharat / state

'రాష్ట్రంలో చురుగ్గా ఉపాధి హామీ పనులు' - రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల వార్తలు

కరోనా కారణంగా వలస కూలీలు స్వస్థలాలకు చేరుకుని ఉపాధి పనులు చేయటంతో.. ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన 21 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ కల్యాణ చక్రవర్తి తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా మరో 4 కోట్ల పనిదినాలు మంజూరు చేసిందని చెప్పారు.

kalyana chakravarthi
గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ కల్యాణ చక్రవర్తి
author img

By

Published : Sep 21, 2020, 2:52 PM IST

రాష్ట్రంలో ఈ ఏడాది ఉపాధి పనులు చురుగ్గా జరుగుతున్నాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ కల్యాణ చక్రవర్తి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో 21 కోట్ల పని దినాలు మంజూరు చేయగా.. కరోనా కారణంగా వలస కూలీలు స్వస్థలాలకు చేరుకొని ఉపాధి పనులు చేశారని.. తద్వారా 21 కోట్ల పని దినాల లక్ష్యం పూర్తయిందన్నారు. దీంతో మరో 6 కోట్ల పని దినాలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా 4 కోట్ల పని దినాలు మంజూరు చేసిందని తెలిపారు.

ఇక సిమెంట్ కాంపోనెంట్ పనులు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని కమిషనర్ చెప్పారు. వచ్చే మార్చి నాటికి 4 వేల కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలనుంచి సిమెంట్ కాంపోనెంట్ పనులు ఎక్కువగా మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో తీర ప్రాంతాల్లోని మడ అడవుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే లేఅవుట్లలో మొక్కల పెంపకం పెద్ద ఎత్తున చేపడుతున్నామని వివరించారు.

ఇవీ చదవండి..

వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.