వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగాడంలో జరుగుతున్న శ్రీ మహాలక్ష్మి తల్లి జాతరలో ఆయన పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం కూల్చివేతలు తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాకే 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పటివరకు ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని... ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు కాస్త మూత పడడానికి కారణం వైకాపా ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: