వైకాపా సర్కారు మూడు రాజదానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ డిమాండ్ చేశారు. ఒకే రాజధాని ఉండాలని... ప్రజలంతా మంచిని గ్రహించాలని కోరారు.
రాజధాని రైతులు చేస్తున్న దీక్షలకు మూడు వందల రోజులైన కారణంగా.. తెదేపా పోరుబాట పట్టనున్నట్లు తెలిపారు.. అమరావతి రైతులు చేస్తున్న కార్యక్రమాలకు సంఘీభావంగా నిలబడతామని కూన స్పష్టం చేశారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: ఔషధ మెుక్కలు సాగుచేస్తూ పురాతన వైద్యమందిస్తున్నాడీ యువకుడు!