శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వినూత్న ప్రచారం శ్రీకాకుళం పార్లమెంట్ తెదేపా అభ్యర్థి రామ్మోహన్ నాయుడు వినూత్న ప్రచారం చేశారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో బ్యాడ్మింటన్, వాలీబాల్ ఆడుతూ ఓట్లు అభ్యర్థించారు. క్రీడాకారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా గుండ లక్ష్మీదేవిని గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
పాలకొండ నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలు భారీ ర్యాలీ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి జయకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ... పార్టీ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అనుచరులు తరలివచ్చారు.
ఇదీ చదవండి....మోహన్‌బాబుకు బెయిల్.. ఫైన్ కట్టేందుకు అంగీకారం!