శ్రీకాకుళం జిల్లా టెక్కలి లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం భూముల్లో పట్టాలు ఇప్పిస్తానని, దిగువస్థాయి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. దేవాదాయశాఖ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న బెలమర ధర్మారావు అమాయకులను మోసం చేస్తున్నాడు.
స్థలాలు ఇప్పిస్తానంటూ పది మంది దగ్గర రూ. 1.40 లక్షలు వసూలు చేయగా, మెళియాపుట్టికి చెందిన ఓ వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.1.60 లక్షలు వసూలు చేశాడు. బాధితులు అందించిన వివరాలతో దేవాదాయశాఖ ఈవో సూర్యనారాయణ టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు... దేవాదాయశాఖ సహాయ కమిషనర్ స్టాంపుతో పాటు జిల్లా కలెక్టర్, తహసీల్దార్ సంతకాలను ధర్మారావు ఫోర్జరీ చేసినట్లు తేల్చారు.
ఇదీ చదవండి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి