ETV Bharat / state

కరోనా ప్రభావం.. రొయ్యల ధరలు పతనం - శ్రీకాకుళం జిల్లాలో పతనమైన రోయ్యల ధరలు

కరోనా అన్ని రంగాలను ప్రభావితం చేసింది. ఈ మహమ్మారి రొయ్యల సాగు రంగాన్ని వదల్లేదు. ఒకేసారి కిలో రూ.30 నుంచి రూ.50 వరకు ధర పడిపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. జిల్లాలో రొయ్యలసాగు సీజన్‌ చివరి దశలో ఉన్నప్పటికీ కొవిడ్‌ ధాటికి ఎగుమతులు కొంతమేర మందగించాయి. క్రమేపీ ధరలు మరింత పతనమవుతాయని ప్రచారం ఊపందుకోవడంతో ఉన్నంత మేరకు రైతులు హడావుడిగా అమ్ముకొంటున్నారు. ఇది దళారులకు వరంగా మారింది.

రోయ్యల ధరలు
SHRIMP COST
author img

By

Published : May 4, 2021, 4:16 PM IST

శ్రీకాకుళం జిల్లాలో సుమారు 2 వేల మంది సాగుదారులు, 10 వేల మంది కార్మికులు ఈ రంగంపై పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. అధికార, అనధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 20 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఏటా రూ.100 కోట్ల వరకు టర్నోవర్‌ ఉంటుంది. వ్యవసాయ రంగం తర్వాత జిల్లాలో ఈ రంగానికి కాలానుగుణంగా రైతులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతా బాగుందనుకున్న సమయంలో రక్కసి కల్లోలానికి ఈ రంగం తీవ్రంగా నష్టపోతూనే ఉంది. కరోనా రెండో దశ వ్యాపారాన్ని మరింత దిగజార్చింది.

ప్రశ్నార్థకంగా భవిష్యత్తు

ప్రస్తుతం ఆక్వారంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పెరిగిన మేతల ధరలు, మందులు, లీజులతో రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో దళారులు ధరలు తగ్గించేస్తుండడంతో లాభం మాట అటుంచితే పెట్టుబడి అయినా వస్తుందా అన్న అనుమానం కలుగుతోంది. ఒడుదొడుకులను తట్టుకోలేక సాగుదార్లు ఇతర రంగాలపై దృష్టి సారిస్తున్నారు.

గతేడాది కొవిడ్‌ ప్రభావంతో ఇదే రోజుల్లో ఎగుమతులు నిలిచిపోగా దానిని ఎగుమతిదారులు సొమ్ము చేసుకున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకు రొయ్యలను కొనుగోలు చేసుకుని శీతల గిడ్డంగుల్లో భారీగా నిల్వ చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అధిక ధర వచ్చినప్పుడు సరకును విక్రయించి రూ.కోట్లలో లాభాలు గడించారని ప్రచారం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.

అధికారుల నియామకం...

కౌంటు వారీగా ధరలు నిర్ణయించి ఆ ప్రకారమే రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఆదేశించింది. ప్రతి ప్రాసెసింగ్‌ ప్లాంటు వద్ద ఇద్దరి చొప్పున మత్స్యశాఖ అధికారులను నియమించింది. ఏ రైతుకు ఎంత ధర చెల్లించి కొనుగోలు చేశారనే వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలపాలని స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో రైతులు స్వల్ప నష్టాలతో బయటపడ్డారు. గతేడాది నవంబర్‌ నుంచి దాదాపుగా స్థిరంగా ఉన్న ధరలు కొద్ది రోజుల నుంచి తగ్గిపోతుండటంతో రైతుల్లో మళ్లీ ఆందోళన మెదలైంది. కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గుముఖం పడుతున్నాయని, మరోసారి ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులను న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.