శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం తెదేపా ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్‌ను సభాపతి తమ్మినేని సీతారాం, ఇతర వైకాపా నేతలు పరామర్శించారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్ తండ్రి... బెందాళం ప్రకాశ్ ఇటీవల మరణించారు. దీంతో ఎమ్మెల్యే స్వగ్రామమైన కవిటి మండలంలోని రామయ్య పుట్టుకకు వెళ్లి పరామర్శించారు. బెందాళం ప్రకాశ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బెందాళం ప్రకాశ్‌తో ఉన్న అనుబంధాన్ని స్పీకర్ గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: భావనపాడు సముద్రతీరంలో మర పడవ బోల్తా..మత్స్యకారులు సురక్షితం