రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వైఎస్సార్ రైతు భరోసా పథకంతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ప్రతి రైతుకు పథకంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, బూర్జల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన... అర్హులందరికీ రైతు భరోసా అందుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దీనికి సంబంధించిన చట్టాన్ని కూడా చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైకాపా నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: