శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం బెలమాం పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులను శాసనసభాపతి తమ్మినేని సీతారాం శ్రీకారం చుట్టారు. జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ మంచినీటి కుళాయి కార్యక్రమానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై గ్రామ సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సామాన్యుడి సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని తమ్మినేని కొనియాడారు. శుక్రవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన సులభతరం చేశారన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు బెండి గోవిందరావు, స్థానిక సర్పంచ్ కిషోర్, పీఏసీఎస్ అధ్యక్షులు జానకి రామ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
"వివేకా హత్య కేసులో... వారి ప్రమేయాన్ని కప్పిపుచ్చేందుకు సజ్జల ప్రయత్నిస్తున్నారు!"