ETV Bharat / state

నెల రోజుల్లో సమస్యను పరిష్కరించండి: హైకోర్టు - Srikakulam district collector news

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని గాడిముదిడంలో బస్టాండ్​కి కేటాయించిన స్థలంలో గ్రామ సచివాలయం ఏర్పాటును అడ్డుకోవాలని హైకోర్టులో అదే గ్రామానికి చెందిన రైతు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేసిన న్యాయస్థానం... నెల రోజుల్లో సమస్యను పరిష్కరించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్​ను ఆదేశించింది.

high court
high court
author img

By

Published : Nov 5, 2020, 9:30 PM IST

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని గాడిముదిడం గ్రామంలో బస్టాండ్​కి కేటాయించిన స్థలంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారంటూ రైతు సత్య నారాయణ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. గ్రామంలోని 193 సర్వే నంబర్​లోని 20 సెంట్ల స్థలాన్ని బస్ షెల్టర్ ,కాంప్లెక్స్​కు అధికారులు కేటాయించారు. ప్రస్తుతం ఆ స్థలంలో కొంతమంది సచివాలయాన్ని నిర్మించాలని యత్నిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

వాదనలు విన్న న్యాయస్థానం నెల రోజుల్లో సమస్యను పరిష్కరించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్​ను ఆదేశించింది. పరిష్కరించిన నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

కేబినెట్ నిర్ణయాలు: రూ. వెయ్యి కోట్లతో భూముల సమగ్ర రీ సర్వే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.