శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నివాస్ తెలిపారు. అధికారులకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. జిల్లాలో 384 కేసులు నమోదు కాగా.. 271 యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు. శ్రీకాకుళం నగరంలో 10 కేసుల వరకు ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ, ముంబయి, గుజరాత్, దిల్లీ తదితర ప్రాంతాల నుంచి రైలు, విమానం తదితర మార్గాల నుంచి జిల్లాకు అనేక మంది వచ్చారన్నారు. బయట నుంచి వచ్చిన వారు దగ్గర బంధువులైనా, ప్రాణ స్నేహితులైనా కలవవద్దని హితవు పలికారు. రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
ఇదీ చదవండి..
వ్యవసాయ బడ్జెట్: కేటాయింపులు తగ్గినా...రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం !