శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కరోనాతో మృతి చెందిన పాత్రికేయుడు సనపల అప్పలనాయుడు సంస్మరణ సభను జర్నలిస్టులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.రవిసుధాకర్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో వెంకటరాజు, సీఐ ప్రసాద్రావులు పాల్గొని పాత్రికేయ సేవలను కొనియాడారు. అప్పలనాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరోనా సమయంలో పాత్రికేయులు అందరికంటే ఎక్కువగా కష్టపడి పని చేస్తున్నారని... వారిని ప్రభుత్వం గుర్తించి సహయ సహకారాలు అందించాలని కోరారు.
ఇదీ చదవండి: