శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరం పంచాయతీ సర్పంచి పదవికి తోటికోడళ్లు పోటీ పడుతున్నారు. శాసనసభాపతి తమ్మినేని సీతారాం సతీమణి తమ్మినేని వాణి... వైకాపా బలపర్చిన అభ్యర్థిగా పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు మద్దతుగా సీతారాం పెద్ద వదిన తమ్మినేని శారద నిలిచారు. తొగరంలో తెదేపా బలపర్చిన సర్పంచి అభ్యర్థిగా సభాపతి చిన్న వదిన తమ్మినేని భారతి నామినేషన్ దాఖలు చేశారు. తమ్మినేని భారతి రెండు పర్యాయాలు ఎంపీపీగా పనిచేశారు. ఆమె భర్త శ్యామలరావు ఎంపీపీగా, జడ్పీటీసీ పదవులు చేపట్టారు.
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో తోటి కోడళ్ల పోరు బలంగా ఉండడంతో విజయం ఎవరిని వరిస్తుందో అనే చర్చ జరుగుతోంది. తమ్మినేని సీతారాం సతీమణి సర్పంచి పదవికి నామినేషన్ వేయడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. ఏదేమైనా తొగరం సర్పంచి పదవి మాత్రం తమ్మినేని కుటుంబాన్నే వరిస్తోంది.
ఇదీ చదవండి: