ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచాలని సంస్థ వైస్ ఛైర్మన్ ఆర్పీ ఠాకూర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ డిపోతో పాటు కాంప్లెక్స్ ప్రాంతాలను ఆయన తనిఖీ చేసారు. మైలేజీని పెంచడం ద్వారా డీజిల్ వినియోగాన్ని తగ్గించి, ఆదాయం పెరిగే దిశగా అడుగులు వేయవచ్చిని ఠాకూర్ సూచించారు. ప్రజల అవసరాల మేరకు సేవలను మెరుగుపరచుటకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మేనేజింగ్ డైరక్టర్ చెప్పారు. ఉద్యోగుల పనితీరు మెరుగుపడాలని సూచించిన ఠాకూర్.. ప్రజా రవాణాశాఖ స్వయం ప్రతిపత్తి దిశగా సాగాలన్నారు. ఉద్యోగుల పాత బకాయిలను చెల్లిస్తామని వెల్లడించారు.
ఇదీచదవండి: బిందెడు నీటి కోసం.. ప్రమాదకర ప్రయాణం