శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ సేవలు పునః ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌తో సుమారు 2 నెలల పాటు నిలిచిపోయిన బస్సులను.. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బస్సులోని సీట్ల విధానం మార్చారు. శ్రీకాకుళం 2 డిపోలతో పాటు పాలకొండ, టెక్కలి, పలాస డిపోలు నుంచి 420 బస్సులకు గాను 73 బస్సులు రోడ్డెక్కాయి.
జిల్లా నుంచి విశాఖపట్నంతో పాటు కీలక మార్గాల్లో బస్సులు నడిపేలా ప్రణాళికలు చేశారు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్న ఆర్టీసీ సిబ్బంది.. శానిటైజర్లను ఏర్పాటు చేశారు. పదేళ్లలోపు పిల్లలు.. అరవై ఏళ్ల పైబడిన వృద్ధులు బస్సుల్లో ప్రయాణించరాదని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: