శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొండాపూరు గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి సత్తిబాబు(43) మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం పొలం పనులకు వెళ్లిన సత్తిబాబు రాత్రి తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం ఉదయం పాలకొండ, శ్రీకాకుళం రహదారి పక్కన సత్తిబాబు మృతదేహం గుర్తించిన అటుగా వెళ్లినవారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అదుపుతప్పి వాహనం ప్రమాదానికి గురైందా...ఏదైనా వాహనం ఢీకొని ఈ ఘటన జరిగిందా అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి