శ్రీకాకుళం జిల్లా భామిని మండలం వంశధార నది వద్ద రెవెన్యూ అధికారులు, పోలీసులు, దాడులు నిర్వహించారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారంతో... తనిఖీలు చేశారు. ఈ దాడులలో 19 లారీలను అధికారులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో ఈ నది ఉంది. రెండు భూభాాగాలలో ఎక్కడా తవ్వకాలు జరిపారో.. రెవెన్యూ అధికారులు గుర్తించిన తర్వాత.. వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీచూడండి. వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనకు మంత్రులు