శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రావులవలస గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామ దేవత ఉత్సవాలపై పోలీసులు ఆంక్షలు విధించిన కారణంగా... గ్రామస్తులు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. నిరాడంబరంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని పోలీసులు చెప్పగా... గ్రామస్తులు అంగీకరించలేదు.
పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఉత్సవాలు నిర్వహిస్తామని స్థానికులు పట్టుబట్టారు. దిగొచ్చిన పోలీసులు శాంతియుతంగా ఉత్సవాలు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: