ETV Bharat / state

కాబుల్ To భారత్: శ్రీకాకుళం వాసి.. ఆర్మీ సీనియర్ కమాండో రాజశేఖర్ మాటల్లో...! - ఆఫ్గాన్​ వార్తలు

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించుకోవటంతో కాబుల్ నుంచి భారత రాయబార కార్యాలయ ఉద్యోగులను దేశానికి తీసుకొచ్చేందుకు ఇండియా తరలింపు ఆపరేషన్‌ చేపట్టింది. ఈ ఆపరేషన్​లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఐటీబీపీ సీనియర్‌ కమాండో పి.రాజశేఖర్‌ పాల్గొన్నారు. విదేశాంగశాఖ ప్రతినిధులు, అధికారులను స్వదేశానికి చేర్చేందుకు చేపట్టిన్ ఆపరేషన్​లో ఎదురైన అవరోధాలను ఆయన వివరించారు.

Indian Embassy staff
భారత రాయబార కార్యాలయ ఉద్యోగుల తరలింపు
author img

By

Published : Aug 19, 2021, 8:04 AM IST

తుపాకులు చేతబట్టిన తాలిబన్లు రాజధాని కాబుల్‌ సహా ఎక్కడ చూసినా గుంపులుగుంపులుగా తిరుగుతుంటే.. అఫ్గాన్‌ ప్రజలతోపాటు విదేశీయులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేస్తున్న వారందర్నీ ఆగమేఘాలపై మన దేశానికి తీసుకొచ్చేందుకు ఇండియా తరలింపు ఆపరేషన్‌ చేపట్టింది. దీనిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పి.రాజశేఖర్‌ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఐటీబీపీలో సీనియర్‌ కమాండోగా పదమూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆయన రెండేళ్లుగా డిప్యుటేషన్‌పై అఫ్గానిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేస్తున్నారు. విదేశాంగశాఖ ప్రతినిధులు, అధికారులను రెండు విడతలుగా స్వదేశానికి చేర్చేందుకు చేపట్టిన ఆపరేషన్‌, ఆ క్రమంలో ఎదురైన అవరోధాలు, వాటిని ఎలా అధిగమించామన్నది.. ఈనాడు - ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.

అంత త్వరగా కాబుల్‌లోకి వచ్చేస్తారనుకోలేదు..

తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లోని ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నా.. కాబుల్‌లోకి అంత త్వరగా ప్రవేశించలేరనుకున్నాం. అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం విడిచివెళ్లిపోవటంతో భద్రతా బలగాలూ చేతులెత్తేశాయి. దీంతో ఆగస్టు 14 రాత్రికే తాలిబన్లు కాబుల్‌లోకి ప్రవేశించగలిగారు. సమాచారం తెలియగానే అక్కడి భారత రాయబార కార్యాలయ సిబ్బంది అందరూ వచ్చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రెండు బృందాలుగా విభజించి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మొదటి బృందంలో విదేశాంగశాఖ అధికారులు 20 మంది, రక్షణగా 25 మంది భద్రతా సిబ్బందిని తరలించాలనేది ప్రణాళిక. పగటిపూట ప్రయాణిస్తే తాలిబన్ల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని 15వ తేదీ రాత్రికే బయల్దేరాలనుకున్నాం. రాయబార కార్యాలయంలో అప్పటికి పది బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలే అందుబాటులో ఉన్నాయి. సమయం ఎక్కువ లేకపోవడంతో.. ముగ్గురు మాత్రమే పట్టే ఒక్కో వాహనంలో అయిదుగురు చొప్పున ఎక్కించాం.
15న రాత్రి 8.30 గంటలకు 45 మంది బృందంతో భారత రాయబార కార్యాలయం నుంచి బయల్దేరాం. అక్కడికి ఆరు కి.మీ. దూరంలో ఉన్న టర్కీస్‌ ఎయిర్‌బేస్‌ చేరుకునేందుకు 45 నిమిషాలు పట్టింది. రోడ్డు పొడవునా జనాలే. వారిలో తాలిబన్లు ఉన్నారేమో అని చూసుకుంటూ ముందుకెళ్లాల్సి వచ్చింది. మొదటి బృందంలోని 45 మంది ఆ రాత్రి ఎయిర్‌బేస్‌లోనే ఉండి 16వ తేదీ వేకువజామున 3 గంటలకు విమానం రావడంతో భారత్‌కు చేరుకున్నారు.

కర్ఫ్యూ ఉంది.. కదలడానికి వీల్లేదు

మేం భారత రాయబార కార్యాలయానికి తిరిగొచ్చేసరికి ఆ మార్గమంతా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. రెండో బృందంలో తరలి వెళ్లాల్సిన వారందరం 15న రాత్రి 10 గంటల సమయంలో బయల్దేరాం. అప్పటికే కార్యాలయాన్ని తాలిబన్లు చుట్టుముట్టారు. రాత్రి కర్ఫ్యూ ఉందని, వెళ్లడానికి వీల్లేదని అడ్డుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో మరో మార్గంలో ఎయిర్‌బేస్‌ వద్దకు బయల్దేరాం. దారి మధ్యలో తాలిబన్లు అడ్డగించడంతో రెండోసారీ వెనుదిరిగాం. దీంతో మమ్మల్ని హెలికాప్టర్లలో తరలించాలని ఉన్నతాధికారులు ప్రణాళిక వేశారు. మన రాయబార కార్యాలయంపై హెలికాప్టర్‌ దిగేందుకు ఏర్పాట్లు లేకపోవడంతో ‘ఎయిర్‌లిఫ్టింగ్‌’కు వీల్లేకుండా పోయింది.

తాలిబన్ల భద్రత మధ్యే ఎయిర్‌బేస్‌కి...

పరిస్థితి తీవ్రత పెరుగుతుండటంతో 16న ఉదయం భారత రాయబార కార్యాలయం అధికారులు తాలిబన్లతో చర్చించారు. అయినా ఫలితం లేదు. పలుమార్లు సంప్రదింపుల తర్వాత మేం వెళ్లడానికి తాలిబన్లు అనుమతిచ్చారు. వారే ఎస్కార్ట్‌గా రావడంతో 17వ తేదీ వేకువజామున 3 గంటలకు టర్కీస్‌ ఎయిర్‌బేస్‌కు చేరాం. ఉదయం 7 గంటలకు బయల్దేరి జామ్‌నగర్‌ మీదుగా సాయంత్రానికి దిల్లీ చేరుకున్నాం.

జెండా వందనం చేసి..

అఫ్గానిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో మన స్వతంత్ర దినోత్సవాన్ని ఏటా వేడుకగా నిర్వహిస్తాం. స్థానికంగా ఉండే భారతీయులంతా హాజరవుతారు. ఆగస్టు 14న రాత్రే తాలిబన్లు కాబుల్‌లోకి ప్రవేశించటంతో రాయబార కార్యాలయ ఉద్యోగులం మాత్రమే జెండా వందనం చేయగలిగాం.

ఇదీ చదవండి:

తాలిబన్లకు షాకిచ్చిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.