ETV Bharat / state

ఆశీలు అధికంగా వసూలు చేస్తున్నాంటూ సంఘ సభ్యులు ఆందోళన

శ్రీకాకుళం జిల్లా రాజాంలో నవదుర్గ ట్రాక్టర్ సంఘ సభ్యులు ఆందోళన బాట పట్టారు. రోజుకు ఒక్కసారే వసూలు చేయాల్సిన ఆశీలు... ట్రాక్టర్​ లోడుతో వచ్చిన ప్రతిసారీ వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అధికారులు స్పందించి అధిక వసూళ్లపై చర్యలు చేపట్టాలని కోరారు.

rajam tractor union members protest for taking more amount while entering into town
నవదుర్గ ట్రాక్టర్​ సంఘ సభ్యుల ఆందోళన
author img

By

Published : Jun 29, 2020, 11:23 AM IST

అధిక ఆశీలు వసూలు చేయడం పట్ల శ్రీకాకుళం జిల్లా నవదుర్గ ట్రాక్టర్​ యూనియన్​ సభ్యులు సరస్వతి తోటలో నిరసన తెలిపారు. రాజాం నగర పంచాయతీ ఆశీల వేలంపాట దారులు... ట్రాక్టర్​ లోడ్​తో పట్టణానికి వచ్చిన ప్రతిసారీ రూ.50 చెల్లించాలంటూ తమ వద్ద నుంచి వసూలు చేస్తున్నారని సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు ఒక్కసారి మాత్రమే వసూలు చేసే రుసుమును... అందుకు విరుద్ధంగా ప్రతి లోడుకు కట్టాలంటే ఇబ్బందిగా ఉందంటూ నవదుర్గ సంఘ నాయుకులు జగన్​మెహన్​రావు తెలిపారు.

ఇప్పటికే డీజిల్​, పెట్రోల్​ ధరలు అధికంగా పెరిగి తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని సంఘ నాయకులు వాపోయారు. దీనిపై నగర పంచాయతీ అధికారులు స్పందించి అధిక ఆశీల వసూళ్లపై చర్యలు చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి:

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా లారీ యాజమాన్య సంఘాల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.