ETV Bharat / state

సీఎం జగన్ పాలనకు త్వరలో చరమగీతం: ఎంపీ రామ్మోహన్ - srikakulam latest news

వైకాపా పాలనకు చరమ గీతం పాడతామని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు.

Raja Reddy is the death knell for the Jagan administration which is enforcing the constitution
'రాజా రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జగన్ పరిపాలనకు చరమగీతం'
author img

By

Published : Nov 24, 2020, 10:57 AM IST

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై.. తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్​తో కలసి శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న సీఎం జగన్ పాలనకు.. చరమగీతం పాడుతామన్నారు. తెదేపా శ్రేణులపై వైకాపా ప్రభుత్వం చేస్తున్న దాడులను అడ్డగించి తీరుతామని స్పష్టం చేశారు. మూడు రాజధానులు అంటూ...మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు.

అంతర్జాతీయ సంస్థలు.. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంటే...ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేయడం అన్యాయన్నారు. ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చింది... సక్రమంగా పాలన కొనసాగించడానికే అని తెలుసుకొని మంచి పాలన అందించాలని హితవు పలికారు.

ఇదీ చదవండి:

తీవ్రంగా మారిన వాయుగుండం.. కోస్తా, సీమపై ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.