కోడి కూర ఎంత పని చేసింది అనిపించక మానదు శ్రీకాకుళం జిల్లా రాజాం మెంతిపేట ఎస్సీ కాలనీలో జరిగిన ఘటన గురించి తెలిస్తే. పెళ్లి వేడుకలో జరిగిన విందు భోజనాల్లో.. కోడి కూర కోసం జరిగిన ఘర్షణ కొట్లాటకు దారి తీసింది. భోజనాలు జరుగుతున్న సమయంలో ఒకరికి రెండో సారి కోడికూర వేయకపోవటమే గొడవకు కారణమైంది.
మాటా మాటా పెరిగి కొట్లాటకు దారితీసింది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునేవరకూ వెళ్లింది. ఈ ఘటనలో గాయపడిన ఇరు వర్గాలవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దలు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా.... బాధితులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇదీ చదవండి: పార్వతీపురంలో లారీ చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్