Purandeshwari on Central Government Funds: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందజేస్తోందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు. త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో డయాలసిస్ కేంద్రం కూడా రాబోతుందని వెల్లడించారు. కేంద్రం ఇంతలా సాయం చేస్తోన్న వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణమైన అవినీతి చేస్తోందని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Purandeshwari Visited Srikakulam: రాష్ట్ర పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన శక్తి కేంద్రాల ప్రముఖులు, పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొని.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ అందిస్తోన్న సహాయ, సహకారాలు, జగన్ ప్రభుత్వం చేస్తోన్న అవినీతిపై ధ్వజమెత్తారు.
ఏపీలో కక్షపూరిత, విధ్వంస రాజకీయాలు - వైసీపీ కుంభకోణాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి : పురందేశ్వరి
Purandeshwari Comments: ''జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతోంది. దేశాభివృద్ధికి బీజేపీ పెద్దపీట వేస్తోంది. ఏపీకి కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండేందుకు కేంద్రం అనేక విధాలుగా ఆర్థిక సహకారం అందజేస్తూనే ఉంది. ఈనాడు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే.. కేంద్ర ప్రభుత్వం వనరుల వలనే. రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తోంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ నిధులతో పలాసలో డయాలసిస్ కేంద్రం వస్తోంది. కేంద్రం అందిస్తోన్న నిధులను అభివృద్ధికి ఖర్చు చేయకుండా ఈ వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతి చేస్తోంది.'' అని పురందేశ్వరి దుయ్యబట్టారు.
బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి: పురందేశ్వరి
Purandeshwari Fire on CM Jagan: రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి తిలోతకాలు ఇస్తూ.. ప్రజాధనాన్ని దండుకునే ఆలోచన చేస్తున్నారని పురందేశ్వరి విమర్శించారు. రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నా.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. రోడ్లు సరిగ్గా లేక ప్రజలు ప్రమాదాల బారినపడి మరణిస్తుంటే.. ఎందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని కేంద్రం నిధులను రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.
''కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తే.. ఎంత మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు..?, రైతు భరోసా కింద ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటా రైతుల ఖాతాల్లో పడుతుందో..?, లేదో..? తెలియని పరిస్థితి నెలకొంది. మద్యానికి బానిసైన వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. వైసీపీ పాలన ఎలా ఉందంటే..వారి జేబులు నిండితే చాలని మంత్రులు, ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు.'' -పురందేశ్వరి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు