రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రజాధనం ఆదా చేశామంటున్న వైకాపా, ఆ సొమ్మును గ్రామ సచివాలయాల రూపంలో తమ కార్యకర్తలకు అప్పగిస్తోందని భాజపా నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. గ్రామ సచివాలయం పథకం పబ్లిసిటీ కోసం వినియోగించిన గాంధీ బొమ్మపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు భాజపాలో చేరుతుంటే వైకాపా కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని వీర్రాజు ఆరోపించారు. మరో 20 ఏళ్లు అధికారంలో ఉండేందుకు వైకాపా ఆరాటపడుతోందని, అది సాధ్యపడే అంశం కాదని అన్నారు.
ఇదీచదవండి