ETV Bharat / state

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల ధర్నాలు - రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల నిరసనలు

కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలలో మార్పులు తీసుకువచ్చి.... కార్మికులకు అన్యాయం చేస్తోందంటూ రాష్ట్ర వాప్తంగా కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. పలు చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. శాసనాల ఉల్లంఘనకు కేంద్రం పాల్పడుతోందని ఆరోపించారు. లాక్​డౌన్ కాలంలో కార్మికులకు ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Protests by workers throughout the state
రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు... కార్మికుల నిరసనలు
author img

By

Published : Jul 3, 2020, 5:43 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా అనంతపురంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. నిరసన చేస్తున్న కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ మేరకు కార్మికులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కృష్ణా జిల్లా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘం ఆధ్వర్యంలో గుంటుపల్లి వర్క్​షాప్ ఎదుట, నందిగామ మున్సిపల్​ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మికులంతా కలిసి తొమ్మిది డిమాండ్లను యాజమాన్యం ముందుంచారు.

కార్మికుల హక్కులను కాలరాస్తున్న భాజపా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రకాశం జిల్లా చీరాలలో కార్నికులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ... కార్మిక చట్టాలను, యజమానులకు అనుకూలంగా మార్చే విధానాన్ని మానుకోవాలని హెచ్చరించారు.

విజయనగరం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో, ఆమదాలవలసలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని కార్మిక సంఘాల నాయకులు కర్నూలులో అన్నారు. ఈ మేరకు కర్నూలులో శాసన ఉల్లంఘన కార్యక్రమాన్ని నిర్వహించగా... పది కార్మికుల సంఘలు పాల్గొన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్​టీయూలు సంయుక్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: 'రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్​ను కోరాం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.