ETV Bharat / state

SPEAKER : స్పీకర్ సమక్షంలో భగ్గుమన్న విభేదాలు... ఉపాధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి మరోసారి వాయిదా పడింది. స్పీకర్ తమ్మినేని సీతారాం నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఎంపీటీసీ సభ్యులు వినకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

స్పీకర్ సమక్షంలో భగ్గుమన్న విభేదాలు
స్పీకర్ సమక్షంలో భగ్గుమన్న విభేదాలు
author img

By

Published : Sep 25, 2021, 8:24 PM IST

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి ఎంపికలో గందరగోళం నెలకొంది. శుక్రవారం జరిగిన ఎన్నిక సమావేశంలో 12 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరుకావాల్సి ఉండగా... 10 మంది మాత్రమే హాజరయ్యారు. ఫలితంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో శనివారం స్వయంగా సభాపతి తమ్మినేని సీతారాం రంగంలోకి దిగారు. గోకర్ణపల్లి ఎంపీటీసీ సభ్యురాలు కిల్లీ ఉషారాణిని ఎంపీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

వైస్ ఎంపీపీ అభ్యర్థిగా రాపాక -1 ఎంపీటీసీ అభ్యర్థి వండాన శ్రీదేవి పేరును ప్రతిపాదించడంతో... బురిడి కంచరాం ఎంపీటీసీ సభ్యుడు బొత్స రమణ అభ్యంతరం చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాంతో వాగ్వాదానికి దిగాడు. ఎంతోకాలం నుంచి పార్టీలో ఉండి, కష్టపడి పని చేస్తున్నానని.. పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ... ఉపాధ్యక్ష పదవి ఎన్నిక వాయిదా పడింది.

పార్టీలో వర్గ విభేదాలు లేవు...

పార్టీలో ఎటువంటి వర్గ విభేదాలు లేవని, పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పని చేస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి ఎన్నికల వాయిదా అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యక్ష పదవి కోసం అందరం కూర్చుని మాట్లాడుకుని ఎంపిక చేసుకుంటామన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

LOW PRESSURE : బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం... తుపానుగా మారే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.