ETV Bharat / state

వివాదాస్పద ప్రాంతంలో నంది విగ్రహం తొలగింపు..16 మందిపై కేసు - సంతబొమ్మాళి పోలీసులు తాజా వార్తలు

శ్రీకాకుళంలో జిల్లా సంతబొమ్మాళిలో వివాదాస్పదంగా మారిన నంది విగ్రహాన్ని పోలీసులు తొలగించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాశీబుగ్గ డీఎస్పీ ఎం. శివరామిరెడ్డి హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఎటువంటి ఆచార సంప్రదాయాలు పాటించకుండా ఉద్దేశ్యపూర్వకంగా నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు చెప్పడం గమనార్హం.

police remove nandi idol in srikakulam
వివాదాస్పద ప్రాంతంలోని నంది విగ్రహాన్నీ తొలగించిన పోలీసులు
author img

By

Published : Jan 17, 2021, 3:18 PM IST

శ్రీకాకుళంలో జిల్లా సంతబొమ్మాళిలోని పాలేశ్వర స్వామి ఆలయ కూడలిలో వివాదాస్పదంగా మారిన నంది విగ్రహాన్ని పోలీసులు శనివారం తొలగించారు.

అసలేం జరిగింది..

ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో ఎర్రన్నాయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెదేపా శ్రేణులు భావించగా.. ప్రభుత్వం మారడంతో అది సాధ్యం కాలేదు. తాజాగా వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుకు వైకాపా శ్రేణులు కసరత్తులు ప్రారంభించారు. అయితే రాత్రికి రాత్రే కూడలి వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైకాపా నాయకులు సంతబొమ్మాళి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.

డీఎస్పీ సందర్శన..

ఈ నేపథ్యంలో కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాత్రివేళ జేసీబీ సాయంతో విగ్రహం ఏర్పాటు చేసిన సిమెంటు దిమ్మను తొలగించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు దిగితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాత్రికి రాత్రే నంది విగ్రహం ఏర్పాటు ఘటనను ఆయన తీవ్రంగా పరిగణించారు.

ఎటువంటి ఆచార సంప్రదాయాలు పాటించకుండా ఉద్దేశ్యపూర్వకంగా నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, మరికొంత మంది పోలీసులకు తెలిపారు. మత విద్వేషాలు సృష్టించే విధంగా, ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విధంగా కుట్ర పన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆక్షేపించారు. విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి లేదని, ప్రజారవాణాకు సైతం ఇబ్బంది కలిగించేలా ఉందని డీఎస్పీ అన్నారు. ఆలయం వద్ద ఉన్న సీసీ పుటేజీల ఆధారంగా విచారణ జరిపి 16 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆలయాలపై దాడుల నేపథ్యంలో నడిరోడ్డుపై ఎటువంటి రక్షణలేని ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని డీఎస్పీ హితవు పలికారు.

ఇదీ చదవండి: నంది విగ్రహం ఏర్పాటుపై వైకాపా నేతల అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.