ETV Bharat / state

కోడి పందెం శిబిరంపై పోలీసుల దాడి.. అదుపులో 8 మంది - కోడి పందాలపై పోలీసులు దాడి

శ్రీకాకుళం జిల్లా జి.జి. వలస గ్రామంలో నిర్వహిస్తున్న కోడి పందాలపై పోలీసులు దాడి చేశారు. వారి నుంచి నగదు, వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

police raided on cock fight den in srikakulam district gg valasa village
కోడి పందెం శిబిరాలపై దాడులు
author img

By

Published : Jan 16, 2021, 10:59 PM IST

శ్రీకాకుళం జిల్లా లావేరు మండల కేంద్రం సమీపంలో ఉన్న జి.జి. వలస గ్రామానికి ఆనుకొని ఉన్న తోటల్లో అనధికారికంగా నిర్వహిస్తున్న కోడి పందెం శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు కార్లు, 6 ద్విచక్ర వాహనాలు, రూ.14,730 నగదు, మూడు పందెం కోళ్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.

ఈ పందెంలో పలు కోళ్లు కత్తిగాటుకు మృతి చెందాయి. ఈ కోడి పందేలను స్థానిక అధికార పార్టీ నాయకులు అధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు పలువురు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై విజయకుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:

వివాహేతర సంబంధం.. రెండు ప్రాణాలు బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.