ETV Bharat / state

పోలీసులు ఇంట్లో చొరబడి .. ఆడపిల్లలను, చిన్నపిల్లలను కూడా కొట్టారు' - చిల్లరరాజంపేటలో పంచాయతీ ఎన్నికలు

ఎలక్షన్స్ అయిపోయాయ్..ప్రశాంతంగా ఉందామనుకున్నారు. అప్పటివరకు పోలీసులకు, గ్రామస్థులకు మధ్య రీకౌంటింగ్ జరిపే అంశంలో గొడవే అయింది. అయినా కాసేపటికే సద్దుమణిగింది. విశ్రాంతి తీసుకుందాం అనేలోపే..అర్థరాత్రివేళా ఒక్కసారిగా పోలీసుల బలగం ఇంట్లో దూరింది. దొరికినవాళ్లను దొరికినట్టుగా కొట్టారు. దండం పెట్టి బతిమాలిడినా కూడా ఊరుకోలేదు. ఆడపిల్లలను , చిన్నపిల్లలను కూడా పోలీసులు కొట్టారు. కారణాలు ఎంటో తెలియదు. ఎందుకు కొట్టారో తెలియదు. మమ్మల్ని మీరే రక్షించండి సారూ..!

police attack at chillararajam peta
చిల్లరరాజంపేటలో పోలీసుల దాడి
author img

By

Published : Feb 22, 2021, 3:17 PM IST

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటరాజాం గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దీంతో రీకౌంటింగ్ నిర్వహించాలని ఇరువర్గాలు కోరాయి. గ్రామస్థులు కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లడంతో పోలీసులు వారిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. అది కాస్త చిలికిచిలికి గాలి వానలా మారింది. దీంతో పోలీసుల, గ్రామస్థులకు మధ్య వివాదం చెలరేగింది. కాసేపటికి గొడవ సద్దుమణిగింది అనే లోపే అర్థరాత్రి వేళా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు గ్రామం మీదకు వచ్చాయని అక్కడ వారు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి విచక్షణారహితంగా దాడి చేశారని గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు.

చిల్లరరాజంపేటలో పోలీసుల లాఠీచార్జ్

పోలీసులంతా ఇళ్లల్లో చొరబడ్డారని.. వస్తువులను ఇళ్లముందు ఉన్న ద్విచక్ర వాహనాలు, ఆటోలు తదితర సామాగ్రి ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జేఆరేపురం పోలీస్ స్టేషన్​లో పలువురు అదుపులో ఉన్నారు. తీవ్రగాయాలైన గ్రామస్థులు సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గొడవకు సంబంధించి సమాచారాన్ని తెలియజేయడలో పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.

ఇదీ చూడండి.
పరదా పట్టల కోసం ఇద్దరు మిత్రుల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.