శ్రీకాకుళం జిల్లా ప్రజలు కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ నివాస్ అన్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వారికి పైడిభీమవరం, ఇచ్ఛాపురం చెక్ పోస్టుల వద్దనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిలో పాజిటివ్‌లు ఎక్కువగా వస్తున్నాయన్న కలెక్టర్... 500 క్వారంటైన్ గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇక నుంచి పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వచ్చే వారిని హోమ్ క్వారంటైన్‌లో పెడతామని పాలనాధికారి వివరించారు. జిల్లాలో అత్యధికంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పిన కలెక్టర్ నివాస్... సామాజిక ఆసుపత్రులకు ప్రజలు వచ్చి పరీక్షలు చేసుకునే విధంగా అవగాహన కలిగిస్తున్నామని పేర్కొన్నారు.
కరోనా సోకినవారి పట్ల వివక్ష చూపవద్దని ప్రజలను కోరారు. బట్టలు, బంగారం, చెప్పుల దుకాణాలు మినహా.. మిగిలిన దుకాణాలు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు తెరవవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం