ETV Bharat / state

PARENTS: మా పిల్లల్ని ఎవరైనా కిడ్నాప్‌ చేస్తే.. ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా? - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

PARENTS PROTEST: పాఠశాలల విలీనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఉదయపురంలోని ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై వారు నిరసన తెలిపారు. ఎక్కడో దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలకు అంత చిన్న పిల్లలు వెళితే.. మధ్యలో వారిని ఎవరైనా కిడ్నాప్‌ చేసినా, ఏదైనా ప్రమాదం జరిగినా ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా? అని నిలదీశారు.

PARENTS
PARENTS
author img

By

Published : Jul 8, 2022, 10:01 AM IST

PARENTS PROTEST: ‘మాకు అమ్మఒడి వద్దు.. చేయూతా వద్దు.. అసలు ఈ ప్రభుత్వమే వద్దు’ అని శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఉదయపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉదయపురంలోని ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై వారు గురువారం తీవ్ర నిరసన తెలిపారు. ఎక్కడో దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలకు అంత చిన్న పిల్లలు వెళితే.. మధ్యలో వారిని ఎవరైనా కిడ్నాప్‌ చేసినా, ఏదైనా ప్రమాదం జరిగినా ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా? అని నిలదీశారు. తల్లిదండ్రులంతా చేతులెత్తి మొక్కుతూ... ప్రాథమిక పాఠశాలను తీసేయవద్దంటూ వేడుకున్నారు. ‘మీ ప్రభుత్వానికి శతకోటి దండాలు. మా స్కూళ్లు మార్చకండి. మమ్మల్ని హింసపెట్టే ఈ ప్రభుత్వం మాకొద్దు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానికంగా ఒక గుడిలో పూజారిగా పనిచేస్తున్న ఓ తండ్రి చిన్న పిల్లల్ని చూపిస్తూ... ‘వీళ్లకు లోకజ్ఞానం ఏం తెలుస్తుంది? వీళ్లకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఎవర్ని అడిగి పాఠశాలల్ని విలీనం చేస్తున్నారు? ’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పోరాటానికి ఉపాధ్యాయులు సంఘీభావం తెలపాలని కోరారు. ఉదయపురంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విడుదల చేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.