ETV Bharat / state

'మీరు మమ్మల్ని బెదిరించినా సరే.. మాకు నచ్చిన వారికే ఓటేస్తాం' - మున్సిపల్​ ఎన్నికల ప్రచారం తాజా వార్తలు

ఎన్నికల ప్రచారం ముగిసినా అధికార పార్టీ మద్దతు దారులు కొందరు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ.. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకు చెందిన కొందరు మహిళలు ఆరోపించారు. అధికార పార్టీ అభ్యర్థులు, మద్దతుదారులు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తమకు నచ్చిన వారికే ఓటేస్తామని వారు తేల్చి చెప్పారు.

palasa municipal
నచ్చిన వారికే ఓటేస్తాం
author img

By

Published : Mar 10, 2021, 5:11 AM IST

తమ అభ్యర్థికి ఓట్లేయకపోతే కుళాయి కనెక్షన్లు తొలగిస్తాం.. పింఛన్లు తీసేస్తాం.. అమ్మఒడి ఆపేస్తామంటూ.. అధికార పార్టీ అభ్యర్థుల మద్దతుదారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 23వ వార్డుకు చెందిన మహిళలు కోపోద్రిక్తులయ్యారు. తమకు నచ్చిన వారికి ఓటేస్తాం గాని.. బెదిరింపులకు తలొంచాల్సిన అవసరం లేదని వారు తేల్చి చెప్పారు.

బెదిరిస్తున్నారంటూ మహిళల ఆరోపణ

పుర ఎన్నికల ప్రచారాలు ముగిసినా.. కొందరు స్థానిక కార్యకర్తలు పలకరింపు నెపంతో ఇంటింటికీ తిరుగుతూ గుట్టుచప్పుడు కాకుండా ప్రచారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎలాగైనా ఓట్లు పొందడం కోసం బెదిరింపుల విధానాన్ని అనుసరించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీల్లో గుట్టుచప్పుడుగా ప్రచారం చేస్తుండగా.. రెండు వర్గాలకు చెందిన మహిళల మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. వెంటనే పక్కనే విధుల్లో ఉన్న పోలీసులు అక్కడికి వచ్చి అందరినీ చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు.

ఇదీ చదవండి:

పోలింగ్​కు సర్వం సిద్ధం.. పరిశీలనకు ప్రత్యేకాధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.