ETV Bharat / state

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి: తమ్మినేని సీతారాం - srikakulam district latest news

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగం కావాలని సభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. జగనన్న పచ్చ తోరణం - వనమహోత్సవ కార్యక్రమాన్ని శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం
స్పీకర్ తమ్మినేని సీతారాం
author img

By

Published : Aug 5, 2021, 3:49 PM IST

ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని సభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. జగనన్న పచ్చ తోరణం - వన మహోత్సవం కార్యక్రమాన్ని శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. మొక్కలను నాటిన సభాపతి సీతారాం.. విద్యార్థి దశ నుంచే మొక్కలు నాటాలన్నారు. అయితే వాటి పెంపకంలో కొంత అవగాహన లోపం కారణంగా పచ్చదనం అనుకున్న స్థాయిలో సాగడం లేదని చెప్పారు.

చెట్లు లేకపోతే ఆరోగ్యం దెబ్బ తింటుందని .. కాలుష్యం పెరుగుతుందని తమ్మినేని చెప్పారు. జిల్లాలో 11 శాతం మాత్రమే అటవీ ప్రాంతం ఉందన్నారు. జిల్లా, మండల, పంచాయతీలలో పాటు మనకు ఉన్న విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండాలని చెప్పారు. జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమంలో 58 లక్షలు మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టినట్టు కలెక్టర్‌ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు.

ఇదీ చదవండి:

devineni uma released: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి.. దేవినేని ఉమా విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.