శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథ సప్తమి వేడుక ఘనంగా జరిగింది. తొలి పూజలో శారదపీఠ ఉత్తరాధిపతి స్వాత్మనందేంద్ర సరస్వతి పాల్గొన్నారు. శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన కృష్ణదాసు, బొత్స సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. దేవాదాయశాఖ తరఫున మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలిపూజ అనంతరం నుంచి వేలాది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు
అరసవల్లి ఆలయం వద్ద మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. క్యూలైన్ వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో భద్రతను పరిశీలించారు. శనివారం లక్షా పాతిక వేల మంది సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. భక్తులు సూర్యోదయం వేళ పుష్కరిణి వద్ద స్నానం చేసి క్షీర అన్నం వండి నివేదన పెట్టారు. అయితే వర్షం కారణంతో ఇంద్ర పుష్కరిణి వద్ద పూజలకు కాస్త అసౌకర్యం కలిగింది. ఆదివారం కూడా ఇదే తరహాలో భక్తులు... స్వామి వారిని దర్శించుకుంటారని దేవస్థాన అధికారులు చెప్తున్నారు. రథ సప్తమి వేడుకల ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి