ETV Bharat / state

నువ్వలరేవు.. అంతా నవ్వుతూ.. ఒకే మాట ఒకే బాట! - శ్రీకాకుళం నువ్వులరేను ఎన్నికలు న్యుస్

స్థానిక ఎన్నికలంటే.. గ్రామాల్లో హడావుడి.. వర్గపోరుతో రాజకీయాలు రచ్చకెక్కుతున్న రోజులివి. బంధువులు సైతం.. సీట్ల కోసం కొట్లాడుకునే మనుషులున్నారు. కానీ.. శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామంలో పరిస్థితి వేరు. ఇక్కడ స్థానికల ఎన్నికల సందడే ఉండదు. ఇక్కడ ఎన్నికలే జరగవా? అంటే జరుగుతాయి.. కానీ ఏళ్లుగా వేరే పద్ధతిలో...!

నువ్వలరేవు.. అంతా నవ్వుతూ.. ఒకే మాట ఒకే బాట!

author img

By

Published : Mar 12, 2020, 9:03 AM IST

నువ్వలరేవు.. అంతా నవ్వుతూ.. ఒకే మాట ఒకే బాట!

ఒకే మాట... ఒకే బాట.. నువ్వలరేవు సొంతం. ఈ గ్రామం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఉంది. అలా అని ఈ ఊరేమి కుగ్రామం కాదండి. 34 వీధులు.. నాలుగు వేల ఎనిమిది వందల గడపలు.. 14 వార్డులు ఉంటాయి. మెుత్తం జనాభా పన్నెండు వేల మంది. అయితే అన్ని గ్రామాల్లోలాగా ఇక్కడ ఎన్నికల కోసం పోటీ ఉండదు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే నువ్వలరేవు గ్రామస్థులంతా సమావేశమవుతారు. ఈ సభలోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. గ్రామ పెద్దలు పోటీ చేసే వారి పేర్లను నిర్ణయిస్తారు. తర్వాత గ్రామస్థులంతా ఏకమై ఎన్నుకుంటారు.

నువ్వలరేవు మత్స్యకార గ్రామం. చేపల వేటే వారికి ప్రధాన జీవనాధారం. ఐదు వేలకు పైగా ఓటర్లు ఉన్న ఇంత పెద్ద గ్రామంలో ఎన్నికల ఊసే ఉండదు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు నుంచి నువ్వలరేవు గ్రామంలో స్థానిక సంస్థ ఎన్నికలన్నీ ఏకగ్రీవమే. ఒక్కసారి కూడా పోటీ లేదు. నోటిఫికేషన్ వచ్చాక.. గ్రామదేవత బృందావతిమాత ఆలయం వద్ద సమావేశం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో ప్రజల సమక్షంలో సర్పంచి, ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు.

ఊరంతా ఏకమై నిర్ణయించిన అభ్యర్థులతోనే నామినేషన్ వేయిస్తారు. సార్వత్రిక, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రమే పోటీ ఉంటుంది. ఒకే మాటపై ఉంటూ... ప్రశాంత వాతావరణంలో ఓటును వినియోగిస్తారు. మద్యం, డబ్బుల పంపిణీకి పూర్తిగా దూరం. ఆడుతూ.. పాడుతూ.. ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసుకుంటారు. ఇంకో విషయం.. ఈ సమయంలో గ్రామానికి ఏ పార్టీ నాయకులు వెళ్లే పరిస్థితి ఉండదు. ఈసారి ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థులుగా మువ్వల ముకుంద, బైనపల్లి నీలాంబరంను ఎంపిక చేశారు. ఏకగ్రీవంతో వచ్చే నిధులతో గ్రామాభివృద్ధికి బాటలు వేస్తున్నారు.

నువ్వలరేవు గ్రామానికి ఇంకా కొన్ని ప్రత్యేకతలున్నాయి. కట్టుబాట్లు, ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. నువ్వలరేవు ఊరంతా ఒకే రోజు.. ఒకటే లగ్నం. అలాగని.. సామూహిక వివాహాలు కాదండోయ్. ఎవరి ఇంటి ముందు వారి పెళ్లే. మూడేళ్లకు ఓ మారు.. జరుపుకొనే పెళ్లిళ్లు అవి. ఇలా ముచ్చటైన పెళ్లిళ్లు చేసుకోవడం ఆనవాయితీ.

ఇక్కడ సంప్రదాయాలు విచిత్రంగా ఉన్నా గ్రామంలో ఎలాంటి రాజకీయ వైషమ్యాలు ఉండవు. ఏకగ్రీవానికి పన్నెండు వేల పైగా జనాభా కలిగిన నువ్వలరేవు గ్రామం కట్టుబడి ఉండడం విశేషమే కదా. ఆశ్చర్యం కలిగించే నువ్వలరేవులో సాంప్రదాయాలు... కట్టుబాటులతో కళకాలం ఇలా ఉండాలనే కోరుకుందాం.

ఇదీ చదవండి:

పంచాయతీరాజ్ మంత్రి ఇలాఖాలో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.