ETV Bharat / state

NIRMALA SITARAMAN: చేనేత అభివృద్ధికి కృషి చేస్తాం - శ్రీకాకుళం జిల్లా పొందూరు

ప్రధాని మోదీ ఖాదీకి ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పొందూరులో పర్యటించిన ఆమె నేతన్నల పరిస్థితులపై ఆరా తీశారు. వారి అవసరాలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. టీకాపై చేస్తున్న దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

NIRMALA SITARAMAN
NIRMALA SITARAMAN
author img

By

Published : Aug 8, 2021, 5:05 AM IST

దేశంలో ఖాదీ పరిశ్రమ, ఉత్పత్తులకు ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రధాని ఎంతో ఇష్టంగా ధరించే కోటు ఖాదీతో చేసిందేనని, చేనేతల అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శనివారం ఆమె శ్రీకాకుళం జిల్లా పొందూరులో పర్యటించారు. ఆంధ్ర ఫైన్‌ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవన ప్రాంగణంలో ఖాదీ వడికే విధానం, చరఖాలను ఆసక్తిగా పరిశీలించారు. నూతన భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ ఖాదీ పట్ల ప్రజల ఆదరణ పెరిగింది. 2014 వరకూ రూ.9 వేల కోట్లుగా ఉన్న ఖాదీ ఉత్పాదకత 2021 నాటికి రూ.18వేల కోట్లకు చేరింది. కానీ కార్మికులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. మంగళగిరి తరహాలో పొందూరులో మెగా క్లస్టర్‌ ఏర్పాటు కాకపోవడానికి కార్మికులు తక్కువ సంఖ్యలో ఉండడమే కారణం కావచ్చని అర్థమవుతోంది. బ్యాంకర్లు, నాబార్డు సంయుక్తంగా కృషి చేసి రాబోయే గాంధీ జయంతి నాటికి ఈ సంఖ్యను 9 వేలకు తీసుకురావాలి. లీడ్‌ బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ సంయుక్తంగా సమావేశం నిర్వహించి ఖాదీ కార్మికులకు ఏయే రుణాలు ఎన్నెన్ని మంజూరు చేశారో సమీక్షించాలి. ఖాదీ ఉత్పత్తులను జెమ్‌ (గవర్నమెంట్‌ ఎలక్ట్రానిక్‌ మార్కెటింగ్‌) పోర్టల్‌లో ఫొటో, ధరలతో అందుబాటులో ఉంచితే కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. పొందూరు ఖాదీని అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను ప్రస్తావిస్తూ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని నిశితంగా పరిశీలించి, సంబంధితశాఖ మంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తా’ అని పేర్కొన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు రూ.350 కోట్ల చెక్కును అందజేశారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, శ్రీకాకుళం, విజయనగరం ఎంపీలు కె.రామ్మోహన్‌ నాయుడు, బెల్లాన చంద్రశేఖర్‌, ఉత్తరాంధ్ర శాసన మండలి సభ్యులు పీవీఎన్‌ మాధవ్‌, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర పథకాలను పార్టీ కార్యకర్తలు పర్యవేక్షించాలి..

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గ్రామస్థాయిలో అర్హులందరికీ అందుతున్నాయో లేదో పర్యవేక్షించాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీˆతారామన్‌ పేర్కొన్నారు. పొందూరులోని ఓ కళ్యాణ మండపంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల భాజపా నాయకులు, కార్యకర్తలతో శనివారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. వీటి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రంగాల్లో నిధులు అందిస్తున్నా క్షేత్రస్థాయిలో ఫలితం కనిపించడం లేదు. సమస్యలు ఏమైనా ఉంటే స్థానిక నాయకుల ద్వారా మా దృష్టికి తీసుకువస్తే పరిష్కారం దిశగా చర్యలు చేపడతాం’ అని చెప్పారు.

టీకాపై దుష్ప్రచారం చేస్తున్నారు...

‘కరోనా టీకా కోసం రూ.35 వేల కోట్లను కేటాయించాం. ఇప్పటికే 50కోట్ల జనాభాకు వ్యాక్సిన్‌ వేశాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్న పంజాబ్‌, రాజస్థాన్‌లలో కరోనా వ్యాక్సిన్‌ వయల్స్‌ని చెత్తబుట్టల్లో వేసి, తమకు వ్యాక్సిన్లు అందించడం లేదని కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు’ అని నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన పథకం కింద అన్ని రాష్ట్రాల్లోని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తే కొన్ని రాష్ట్రాలు కనీసం ప్రధాని మోదీ పేరు కనిపించకుండా తమ పథకాలుగా ప్రచారాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

NIRMALA SEETARAMAN: 'భాజపా బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.