ETV Bharat / state

ఎంఎస్ఎంఈలకు ఆర్ధికసాయం - ఎంఎస్ఎంఈలకు ఆర్ధికసాయం

ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం రీస్టార్ట్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్‌ నివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

msme program in srikakulam
msme program in srikakulam
author img

By

Published : May 22, 2020, 6:34 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు సహకారం అందిస్తుందని సీఎం జగన్మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం రీస్టార్ట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని.. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్‌ నివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఎస్‌ఎంఈలపై కలెక్టర్లంతా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు.

శ్రీకాకుళం జిల్లాలో 27 సూక్ష్మ పరిశ్రమల యూనిట్లకు 1 కోటి 65 లక్షల 25 వేలు.. 70 చిన్న పరిశ్రమల యూనిట్స్‌కు 13 కోట్లు, మహిళల ద్వారా నడుపుతున్న 40 యూనిట్లకు.. ప్రస్తుత రీస్టార్ట్ కార్యక్రమంలో లబ్ది పొందారని అధికారులు తెలిపారు.

కచ్చితంగా ఎంఎస్‌ఎంఈల సమస్యలు పరిష్కరించాలన్న సీఎం.. లాక్‌డౌన్‌ సమయంలో ఈ రంగం పూర్తిగా కుదేలైన పరిస్థితి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అన్నిరకాలుగా ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ప్రతి పరిశ్రమకు తక్కువ వడ్డీకే రుణాలు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.