శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో బంగారు, వస్త్ర, చెప్పుల దుకాణ యజమానులతో ఎమ్మార్వో ప్రవల్లిక ప్రియ సమావేశం నిర్వహించారు. దుకాణాలు తెరిచేముందు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆమె పేర్కొన్నారు. కొనుగోలుదారులు తమ ఆధార్ సంఖ్యను నమోదు చేయాలని, మాస్కులు, శానిటైజర్లు వినియోగించే విధంగా దుకాణాల యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన యాప్ లో పేర్కొన్న అంశాలు నమోదు చేయాలని ఎమ్మార్వో ప్రవల్లిక ప్రియ, ఎస్ఐ సత్యనారాయణ వివరించారు. నిబంధనలు పాటించకుంటే దుకాణాలు మూసివేసేందుకు చర్యలు తప్పవని హెచ్చరించారు.
'నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి' - gold shops latest news in narasannapeta
బంగారు, వస్త్ర, చెప్పుల దుకాణాలు తెరిచేముందు షాపు యజమానులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన మొబైల్ యాప్ ను వినియోగిస్తూ వ్యాపారాలు సాగించాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో బంగారు, వస్త్ర, చెప్పుల దుకాణ యజమానులతో ఎమ్మార్వో ప్రవల్లిక ప్రియ సమావేశం నిర్వహించారు. దుకాణాలు తెరిచేముందు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆమె పేర్కొన్నారు. కొనుగోలుదారులు తమ ఆధార్ సంఖ్యను నమోదు చేయాలని, మాస్కులు, శానిటైజర్లు వినియోగించే విధంగా దుకాణాల యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన యాప్ లో పేర్కొన్న అంశాలు నమోదు చేయాలని ఎమ్మార్వో ప్రవల్లిక ప్రియ, ఎస్ఐ సత్యనారాయణ వివరించారు. నిబంధనలు పాటించకుంటే దుకాణాలు మూసివేసేందుకు చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి: నరసన్నపేటలో తెరుచుకున్న బంగారు, వస్త్ర దుకాణాలు