ETV Bharat / state

స్పందనలో మంత్రి ధర్మాన... ప్రజా వినతులు స్వీకరణ - మంత్రి ధర్మాన కృష్ణదాస్ వార్తలు

శ్రీకాకుళంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్​ పాల్గొన్నారు. ఆర్జీదారుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

minister dharmana participated in spandana program
మంత్రి ధర్మాన
author img

By

Published : Dec 30, 2019, 5:56 PM IST

స్పందనలో మంత్రి ధర్మాన... ప్రజా వినతులు స్వీకరణ

స్పందన కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.... ఆర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. స్పందన కార్యక్రమం అత్యంత ప్రజాదరణ పొందిందన్న మంత్రి కృష్ణదాస్.. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. దీనిని కొనసాగించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:సీఎం జగన్​తో తెదేపా ఎమ్మెల్యే మద్దాలి గిరి భేటీ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.