ETV Bharat / state

సిండికేట్​గా మారి దోచుకుంటున్న మిల్లర్లు.. శ్రీకాకుళంలో రైతుల ఆవేదన

Millers Fraud In Grain Procurement : ఆరుగాలం కష్టపడ్డారు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకున్నారు చేతికొచ్చే సమయంలో పడిన వర్షాల నుంచి పంటను కాపాడుకున్నారు. తీరా పంట అమ్ముదామంటే మిల్లర్లు ముంచేస్తున్నారు. తేమశాతం పేరిట ధాన్యం రైతులను అడ్డంగా దోచేస్తున్నారు. తరుగు అంటూ క్వింటాకు 5 కిలోల వరకు దోపిడీ చేస్తున్నారు.

Millers Fraud
మిల్లర్ల మోసం
author img

By

Published : Dec 18, 2022, 7:10 PM IST

Millers Fraud In Grain Procurement : శ్రీకాకుళం జిల్లాలో వరి రైతులకు తిప్పలు తప్పడం లేదు. అష్టకష్టాల తర్వాత పంట చేతికి వస్తే మిల్లర్ల నిర్వాకంతో తీవ్రంగా నష్టపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం తేమశాతం పరీక్షించి.. బరువు వేసిన తర్వాతే మిల్లర్ల వద్దకు పంపిస్తున్నారు. దానిప్రకారమే మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాలి. కానీ, ఇక్కడే మిల్లర్లు రైతులను దోచేస్తున్నారు. అందరూ సిండికేట్‌గా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని తేమ శాతంలో గోల్‌మాల్‌ చేస్తున్నారు. తేమశాతం అధికంగా చూపించి.. తరుగు ఇవ్వనిదే ధాన్యం దించేదిలేదంటూ.. తెగేసి చెబుతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో తేమశాతం ఒకలాగా మిల్లర్ల దగ్గర మరొకలా ఉండడంతో రైతులు విస్తుపోతున్నారు.

"రైతు భరోసా కేంద్రంలో తేమ శాతం చూసి ధాన్యాన్ని మిల్లుకు పంపిస్తున్నారు. మిల్లుకు వెళ్లిన తర్వాత రైతు భరోసా కేంద్రంలో చూపిన తేమ శాతం కన్నా మూడు, నాలుగు పాయింట్లు తేమ శాతాన్ని అధికంగా చూపిస్తున్నారు. దీనిలో ఎవరిది నమ్మాలి. ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యం తరుగు ఇవ్వందు అంటోది. దీంతో క్వింటాలుకు 3నుంచి 4 కిలోల వరకు ధాన్యం కోత విధిస్తున్నారు." - గంగాధర్, రైతు- శ్రీకాకుళం

"మేము ధాన్యం మిల్లుకు తీసుకుపోయే సరికి తేమ శాతం 22 నుంచి 23 చూపిస్తున్నారు. అదే ధాన్యానికి రైతు భరోసా కేంద్రంలో 14 వస్తోంది. తేమ శాతం ఎంత అధికంగా వస్తే అన్ని కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. రాజీపడి క్వింటాలుకు 2 నుంచి 3 కిలోల వరకు ధాన్యం ఇవ్వక తప్పటం లేదు." -వెంకటరమణమూర్తి, రైతు-జల్లువలస

మిల్లర్ల మోసాన్ని ప్రశ్నిస్తే ధాన్యం కొనుగోలు చేయమని వెనక్కి పంపించేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలు, రవాణా ఛార్జీలు భరించలేక మిల్లర్లు అడిగిన తరుగు ధాన్యం ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. మిల్లర్ల చేస్తున్న మోసంపై అధికారులకు చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

"నేను 40 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లుకు తీసుకు వెళ్లాను. నేను తీసుకు వెళ్లిన ధాన్యానికి క్వింటాలుకు 7 కేజిల చొప్పున తరుగు ఇవ్వమని మిల్లులో డిమాండ్​ చేశారు. నేను ఇవ్వనని వీఆర్​వోకి చెప్తే.. వాళ్లే దించుతారు నువ్వు అక్కడే ఉండమని అన్నారు. వారు తిరిగి ఇంటికి తీసుకురాడానికి ఛార్జీలు, మళ్లీ వాహనం నుంచి దింపటానికి డబ్బులు లేక చివరికి కిలోన్నర ఇచ్చాను." -సూర్య ప్రకాష్, రైతు - గార గ్రామం

శ్రీకాకుళం జిల్లాలో మిల్లర్ల నిర్వాకంతో నష్టపోతున్న వరి రైతులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.