శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని కంబర గ్రామానికి చెందిన శ్రీనివాస రావు కొబ్బరి చెట్టు నుంచి జారిపడి మృతి చెందాడు. కొబ్బరికాయలు విక్రయించి ఉపాధి పొందుతున్న ఆయన వాటిని కోసే క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టు నుంచి జారి పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతణ్ని ఆటోలో పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: