శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం మెగా జాబ్మేళా నిర్వహించారు. రెడ్ ఎక్స్ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ నిర్వహించారు. నిరుద్యోగ యువత ఎంపికకు హాజరయ్యారు. పరిసర గ్రామాలకు చెందిన 70 మంది యువత జాబ్ మేళాలో పాల్గొన్నారు. అభ్యర్థుల విద్యార్హత, ఆసక్తి ఆధారంగా ఎంపికలు చేశారు. ఎంపికైన వారికి విశాఖపట్నంలో ఉచిత శిక్షణ నిర్వహించి, తర్వాత ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి:వైద్య విద్యలో జీవో 550ను సరిగ్గా అమలు చేయలేదని ధర్నా