ETV Bharat / state

మాస్కులు, కూరగాయలు పంపిణీ చేసిన దాతలు - శ్రీకాకుళం జిల్లాలో లివింగ్ శ్రీకృష్ణ మినిస్ట్రీస్ మాస్కుల పంపిణీ న్యూస్

కరోనాపై పోరాడుతున్న వారికి, పేదలకు బాసటగా నిలుస్తున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు. శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో కొంతమంది దాతలు మాస్కులు పంపిణీ చేయగా... మరికొంత మంది నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

మాస్కులు, కూరగాయలు పంపిణీ చేస్తున్న దాతలు

author img

By

Published : May 7, 2020, 11:32 PM IST

పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 22వేల మాస్కులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరికి 3 మాస్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించటంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మాస్కులను ప్రజలకు అందించారు. సంతకవిటి మండల కేంద్రంలో పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలానికి చెందిన 'లివింగ్ శ్రీకృష్ణ మినిస్ట్రీస్​' స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ఒక్కో కుటుంబానికి రూ.2500 విలువచేసే వస్తువులను సంస్థ డైరెక్టర్ దేవసహాయం చేతులమీదగా అందించారు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు తెదేపా అండగా నిలిచింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పరిధిలోని మురపాక, లావేరు పీహెచ్​సీ వైద్యులకు, వైద్య సిబ్బందికి 500 మాస్కులను మండల తెదేపా అధ్యక్షుడు సురేష్ పంపిణీ చేశారు.

ఇదీ చూడండి: కరోనా ప్రభావం: మాస్కులు, శానిటైజర్ల నడుమ వివాహం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.