శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కె. ఇచ్చాపురం గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన నిమ్మక సన్యాసి.. గ్రామ రచ్చబండ వద్ద కుమారుడు ప్రసాద్, రాంబాబు మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఆకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో వాళ్లు ఉన్న చోటు పిడుగు పడటంతో సన్యాసి.. ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. ప్రసాద్ కొంత దూరం ఎగిరిపడ్డాడు. గాయపడిన ప్రసాద్, రాంబాబులను గ్రామస్థులు.. పాలకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ పెద్ద దిక్కు మృతితో సన్యాసి భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి..